మెహ్రీన్ మరో నమిత అవ్వదు కదా ?

Thursday, October 19th, 2017, 11:50:51 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం లేటెస్ట్ హీరోయిన్స్ వారి హవాను బాగానే కొనసాగిస్తున్నారు. ఏ మాత్రం తొందరపడకుండా వారికి నచ్చిన కథలను ఎంచుకుంటున్నారు, కథ నచ్చితే చిన్న హీరోలతో అయినా జోడి కడుతున్నారు. అదే తరహాలో మెహ్రిన్ పిర్జాద కూడా మంచి సినిమాలను చేస్తూ.. గుర్తింపు దక్కించుకుంటోంది.అమ్మడు మొదట నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా మంచి విజయం అందుకోవడంతో భారీ ఆఫర్లు వచ్చాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా బాగానే పెరిగారు.

అయితే ఈ మధ్య మెహ్రీన్ కొంచెం బొద్దుగా తయారవుతోంది. సాధారణంగా హీరోయిన్స్ ఎక్కువగా నాజూకుగా ఉండడానికి ట్రై చేస్తారు. రోజుకు ఆరుగంటలు జిమ్ లోనే వర్కౌట్స్ చేస్తూ శరీరాకృతుని అందంగా మలుచుకుంటారు. అయితే ప్రస్తుతం మెహ్రీన్ ని చుస్తుంటే అసలు అందం మీద శ్రద్దా తీసుకుంటుందా లేదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే అమ్మడు మహానుభావుడు సినిమాలో కాస్త గ్లామర్ షోని బాగానే చేసింది. దీంతో బొద్దుగా కనిపించేసరికి చూసేందుకు కొంచెం ఇబ్బందిగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక రాజా ది గ్రేట్ సినిమాలో కూడా దాదాపు అలానే కనిపించింది. అమ్మడు ఇలానే ఉంటె నమిత – హన్సిక లాగా ఫేడవుట్ అయిపోవాల్సి వస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.