మెహ్రీన్ పారితోషికం 80ల‌క్ష‌లు?

Friday, April 6th, 2018, 09:40:08 PM IST


పారితోషికం అందుకోవ‌డానికి జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేద‌ని నిరూపిస్తోంది ఈ న‌వ‌త‌రం నాయిక‌. చూడ‌టానికి ముద్దుగా బొద్దుగా ఉండే ఈ అమ్మ‌డికి వ‌రుస‌గా రెండు ఝ‌ల‌క్‌లు త‌గిలినా టాలీవుడ్లో మాత్రం క్రేజు త‌గ్గ‌లేదు. మ‌న మేక‌ర్స్ ప‌దే ప‌దే వెంట‌ప‌డుతుండ‌డంతో అమ్మ‌డు పారితోషికం విష‌యంలో చెట్టెక్కి కూచుంటోందిట‌. ఇంత‌కీ ఎవ‌రీ భామ‌? అంటే .. రాజా ది గ్రేట్‌, మ‌హానుభావుడు, జ‌వాన్ చిత్రాల నాయిక మెహ్రీన్ కౌర్‌. ఇటీవ‌ల రెండు ఫ్లాపులొచ్చినా మెహ్రీన్ కి ఉన్న ఫాలోయింగ్ పెరిగిందే కానీ త‌గ్గ‌లేద‌న‌డానికి ఇదిగో ఇదే ఉదాహ‌ర‌ణ‌.

ప్ర‌స్తుతం ఈ ముంబై బొమ్మ‌ను నాగ‌శౌర్య తాజా చిత్రం `న‌ర్త‌న‌శాల‌`లో న‌టింప‌జేసేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఇన్నాళ్లు రూ.50ల‌క్ష‌ల పారితోషికం అందుకున్న ఈ భామ కుర్ర హీరో సినిమా కోసం ఏకంగా రూ.80ల‌క్ష‌లు డిమాండ్ చేస్తోందిట‌. అయితే స‌ద‌రు భామ వ్య‌వ‌హారం గిట్ట‌క నిర్మాత‌లు వేరొక ఆల్ట‌ర్నేట్ వెతుక్కునే ప‌నిలో న్నారని తెలిసింది. త‌మ‌న్నా, కీర్తి సురేష్ త‌ర‌వాత నెక్ట్స్ లెవ‌ల్లో ఉందీ అమ్మ‌డు.

  •  
  •  
  •  
  •  

Comments