బాలయ్య సినిమాలో కనిపించనున్న ఎమ్మెల్యే రోజా – ఈసారి విలన్ పాత్రలో

Friday, October 18th, 2019, 08:55:15 PM IST

ప్రస్తుతానికి నగరి ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా, సినిమాలని పక్కన బెట్టి పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితమైపోయారు. అయితే రాజకీయాలతో పాటు ఒక టీవీ షో లో జడ్జి గా కనిపించి అలరిస్తున్నారు. కాగా నగరి నియోజక వర్గం నుండి వరుసగా రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రోజా కి వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన నామినేటెడ్ పదవిని అప్పగించారు. కాగా ప్రస్తుతానికి ఆలా రాజకీయ సమీకరణలతో, టీవీ షో లో బిజీగా గడుతుపుటున్నటువంటి రోజా విషయంలో మరొక వార్త ఇపుడు చక్కర్లు కొడుతోంది. అదేంటంటే… రోజా మళ్ళీ సినిమాల్లో నటించనున్నారట.

కాగా నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల కలయికలో రాబోతున్నటువంటి చిత్రంలో ఎమ్మెల్యే రోజా ఒక పవుర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. అయితే ఆ పాత్ర హీరో పాత్రకి గట్టి పోటీ ఒకే పాత్ర కావడంతో, ఆ పాత్రకు రోజా అయితేనే న్యాయం చేస్తుందనే నమ్మకంతో, ఈ పాత్ర విషయంలో రోజాను సంప్రదించినట్టు సమాచారం. అయితే ఈ హీరో బాలయ్యని ఢీకొట్టే పాత్ర చేయడానికి రోజా కూడా సమ్మతం తెలిపిందని సమాచారం. కాగా వీరిద్దరూ కూడా గతంలో కొన్ని హిట్ సినిమాల్లో కలిసి నటించారు. కానీ మొదటి సరిగా ఇద్దరు వ్యతిరేక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ పాత్రలో రోజా ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి మరి.