చిరు వేడుక మోహ‌న్‌బాబు చేతులమీదుగా!

Sunday, September 18th, 2016, 10:02:50 AM IST

chiru-mohan-babu
నిన్న రాత్రే విశాఖ‌ప‌ట్నంలో మోహ‌న్‌బాబు నాలుగు ప‌దుల న‌ట ప్ర‌స్థానానికి సంబంధించిన వేడుక జ‌రిగింది. టీఎస్సార్ త‌న పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని ఈ వేడుక జ‌రిపారు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి దాస‌రి, కె.రాఘ‌వేంద్ర‌రావు, చిరంజీవి, అల్లు అర‌వింద్ త‌దిత‌ర అతిర‌థ మ‌హార‌థులెంద‌రో ఈ వేడుక‌లో పాలు పంచుకొన్నారు. ఈ సంద‌ర్భంగా మోహ‌న్‌బాబు ఉద్వేగానికి గుర‌య్యారు. త‌న న‌ట ప్ర‌యాణాన్ని, కిందిస్థాయి నుంచి పైకొచ్చిన విధానాన్ని వేదిక‌పై గుర్తు చేసుకొన్నారు. ముఖ్యంగా వేడుక‌కి చిరు హాజ‌ర‌వ‌డం ఆయ‌న్ని మ‌రింత సంతోష‌పెట్టింది. ఆ సంతోషంలో చిరంజీవి న‌ల‌భయ్యేళ్ల న‌ట ప్ర‌యాణానికి సంబంధించిన వేడుక‌ని నా చేతుల‌మీదుగా తిరుప‌తిలో నిర్వ‌హిస్తాన‌ని చెప్ప‌డం విశేషం. కొంత‌కాలం కింద‌టివ‌ర‌కు చిరంజీవి, మోహ‌న్‌బాబుల్ని అంతా బ‌ద్ధ శ‌త్రువులు అనుకొనేవాళ్లు. ఇప్ప‌టికీ వారిద్ద‌రి మ‌ధ్య వైరం ఉంద‌నే భావ‌న ప్రేక్ష‌కుల్లోనూ, ప‌రిశ్ర‌మ‌వ‌ర్గాల్లోనూ క‌నిపిస్తుంటుంది. కానీ మేం మాత్రం ఒక‌రికొక‌రు ఆత్మీయులం అని వేడుక‌లో ఐక్య‌తారాగం ఆల‌పించారు. మేం ఒక‌రికొక‌రం క‌ల‌లో కూడా చెడు కోరుకోం అని మోహ‌న్‌బాబు స్ప‌ష్టం చేశారు. మోహ‌న్‌బాబుది రాక్ష‌స ప్రేమ అని చిరంజీవి అన్నారు. మొత్తంగా వాళ్లిద్ద‌రి మ‌ధ్య మైత్రి మాత్రం జ‌నాల్ని విశేషంగా ఆక‌ట్టుకుంది.