షాక్ .. విలన్ పాత్రలతో జగ్గు భాయ్ సంచలనం ?

Saturday, October 13th, 2018, 10:16:19 PM IST

ఆడు మామూలోడు కాదు బాల్రెడ్డి .. చావు చొక్కాలేకుండా తిరుగుట ఎట్లుంటాడో చెలుసా ?… ఆడి పొగరు .. చూచుంటే ముచ్చటేస్తుంది బాల్రెడ్డి అంటూ అరవింద సమేత లో తనదైన విలనిజంతో ఆకట్టుకున్నాడు జగపతిబాబు. ప్రస్తుతం నెగిటివ్ పాత్రలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారాడు జగ్గూభాయ్. బాలయ్య లెజెండ్ సినిమాతో విలన్ గా టర్న్ తీసుకున్న అయన వరుసగా భిన్నమైన నెగిటివ్ పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే రంగస్థలంలో ప్రసిడెంట్ గా అదరగొట్టిన జగ్గూభాయ్ తాజాగా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత లో బసిరెడ్డి గా పక్కా ఫ్యాక్షన్ నాయకుడిగా కనిపించి అదరగొట్టాడు.

ప్రస్తుతం అయన విలన్ గా సంచలనం రేపుతున్నాడు. ఒక్క తెలుగులోనే కాదు .. అటు తమిళ, హిందీ భాషల్లో కూడా జగ్గు భాయ్ కు అవకాశాలు క్యూ కడుతున్నాయి . మొత్తానికి తెలుగులో హీరోలకు సమఉజ్జి లా మంచి విలన్ దొరికేసాడని అంటున్నారు. ఇంతకు ముందు విలన్ పాత్రలకోసం పరాయి బాషల నటులపై ఆధారపడే మనం ఇప్పుడు ఇక్కడే సొంత విలన్స్ ని తయారు చేసుకుంటున్నాం.