“కేజీయఫ్” టీమ్ నుంచి ఇది ఊహించనిదే.!

Wednesday, July 29th, 2020, 11:09:32 AM IST

మన దేశంలోనే ఫిల్మ్ లవర్స్ కు “కేజీయఫ్” సినిమా అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. బాహుబలి తర్వాత మన దేశంలోనే అంతలా అన్ని భాషల్లోనూ ఈ చిత్రం ఇంపాక్ట్ కలిగింది. చాప్టర్ 1 తోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం చాప్టర్ 2 తో ఊహించని విధమైన అంచనాలను నెలకొల్పుకుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఆ భారీ ప్రాజెక్ట్ పై ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు.

అలాగే ఈ చిత్రంలో మెయిన్ లీడ్ లో యష్ రాకీ భాయ్ గా ఇచ్చిన అవుట్ ఫుట్ అయితే మాస్ అభిమానులకు ఒక ఫీస్ట్ అని చెప్పాలి. అంతలా ఈ రోల్ ముద్ర పడిపోయింది. అయితే చాప్టర్ 1లో ఆ రోల్ కు గట్టి ప్రతినాయకుని పాత్రలో గరుడ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇక సెకండ్ చాప్టర్ విషయానికి వస్తే అంతకు మించిన స్థాయిలో ఉండే పాత్ర “అధీరా”.

మొదటి చిత్రంలో కేవలం ముసుగుతో మాత్రమే కనిపించిన రోల్ పెద్ద సస్పెన్స్ నే నెలకొల్పింది. దీని తర్వాత బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఈ రోల్ లో కనిపించనున్నారని కన్ఫర్మ్ అయ్యాక భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు సంజయ్ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ అధీరా లుక్ ను రివీల్ చేయనున్నామని చెప్పి ఈరోజు విడుదల చేసారు.

ఈ లుక్ లో సంజయ్ ను చూసిన వారు మాత్రం ఈ రేంజ్ లో కనిపిస్తారని ఏమాత్రం ఊహించి ఉండరు. కత్తిని పట్టుకొని మొహం పై హిందీ భాషలో ఉన్నట్టు ఓ స్టైలిష్ టాటూ సరికొత్త హెయిర్ స్టైల్ తో ఒక పవర్ ఫుల్ స్టైలిష్ విలన్ గా చూపించారు. లుక్ పరంగా ఇది స్టైలిష్ గా ఉన్నా కోపంగా ఉన్న స్టిల్ ను కనుక వదిలి ఉంటే ఇంకో రేంజ్ లో ఉండి ఉండేది. మొత్తానికి మాత్రం ఇది కూడా మైండ్ బ్లాకింగ్ గానే ఉందని చెప్పాలి.