వాహ్..ఫస్ట్ లుక్ తో పర్ఫెక్ట్ ట్రీట్ ఇచ్చిన డార్లింగ్..!

Friday, July 10th, 2020, 10:26:20 AM IST

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు అంటే అది మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా మాత్రమే కాకుండా మోస్ట్ సస్పెన్సింగ్ ప్రాజెక్ట్ గా కూడా మారుతుంది అని చెప్పాలి. అలా బాహుబలి తర్వాత నుంచి టైం టు టైం అప్డేట్స్ అనే మాటనే డార్లింగ్ అభిమానులు మర్చిపోయారు.

ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తే తప్పితే వారికి ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసే భాగ్యం కలగడం లేదు. ఇదిలా ఉండగా వారు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు విడుదలయింది.

రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ కు ఫైనల్ గా “రాధే శ్యామ్” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక పోస్టర్ లుక్ విషయానికి వస్తే ఒక్క మాటలో చెప్పాలి అంటే సింప్లి అమేజింగ్ పోస్టర్ అని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ లో వింటేజ్ సెట్స్ కానీ ప్రభాస్ స్టైలింగ్ లుక్ కానీ స్టన్నింగ్ గా ఉన్నాయి.

ఇక అలాగే పూజా హెగ్డే డ్రెస్సింగ్ గమనిస్తే అందులో రెడ్ కలర్ లో ప్రపంచాన్ని అంతా కప్పి ఉన్నట్టుగా చూపించారు. బహుశా అది వారి ప్రేమకు చిహ్నంగా అనుకోవచ్చు. అలాగే ఈ చిత్రాన్ని 2021 లో అన్ని కీలక భాషల్లో తీసుకు రానున్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ వింటేజ్ స్వచ్ఛమైన ప్రేమ కథ ఎలా ఉంటుందో చూడాలి.