మిస్టర్ మజ్ను రిలీజ్ డేట్ మారిందా ?

Monday, October 8th, 2018, 09:21:17 PM IST

అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ మజ్ను సినిమా షూటింగ్ ఓ భారీ షెడ్యూల్ ని ఇటీవలే అమెరికాలో పూర్తీ చేసారు . తదుపరి షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ కు అనూహ్యమైన స్పందన రావడంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. పక్క ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాని నిజానికి డిసెంబర్ లో విడుదల చేయాలనీ అనుకున్నారు .. కానీ అది ఎందుకో జనవరి 26కు వెళ్ళింది .

ఇప్పుడు ఈ సినిమా విడుదల విషయంలో మేకర్స్ మళ్ళీ ఆలోచనలో పడ్డారట .. ఈ సినిమాను జనవరి 26న కాకుండా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున విడుదల చేస్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ఫోన్ కావడానికి మరో కారణం కూడా ఉంది. అదేమిటంటే … ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా విడుదలకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే .. రెండో భాభాగం ఎన్టీఆర్ మహానాయకుడు జనవరి 26న విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేసినట్టు తెలుస్తోంది.