ట్విట్టర్ లో రికార్డుల దుమ్ము రేపుతున్న ధోని ఫ్యాన్స్..!

Tuesday, July 7th, 2020, 11:17:00 AM IST

మన దేశంలో సినిమా హీరోలను ఏ స్థాయిలో అభిమానులు ఆరాధిస్తారో అంతే స్థాయిలో తమ అభిమాన క్రికెట్ ప్లేయర్స్ ను కూడా ఆరాధిస్తారు. అలా మన ఇండియన్ స్టార్ క్రికెటర్స్ లో “కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మాజీ భారత కెప్టెన్, ఎన్నో రికార్డుల సృష్టికర్త, 130 కోట్ల భారతీయులు కన్న కలలను తన జట్టు సారధ్యంలో నిజం చేసిన ఝార్ఖండ్ డైనమైట్ అధినేత మహేంద్ర సింగ్” ధోని కూడా ఒకరు.

ఈ రోజు జూలై 7 తో ధోని 39 వ ఏట అడుగు పెడుతుండటంతో ధోని ఫ్యాన్స్ ఆన్లైన్ లో సంబరాలు అంబరాన్ని అంటించారు. అప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టేసి కొత్త రికార్డులను సృష్టించడమేకాకుండా ధోని బర్త్ డే ట్రెండ్ ను వరల్డ్ వైడ్ గా టాప్ లిస్ట్ లో సెట్ చేసి ట్విట్టర్ లో దుమ్ము రేపుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు, రాజకీయ నాయకులు ఇతర క్రికెటర్లు తమ విషెస్ ను ధోనీకి తెలిపి తమ శుభాకాంక్షలు అందించారు.