అన్ని జాగ్రత్తలు పాటిస్తాం.. ప్లాన్ సిద్దం చేసిన మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా..!

Thursday, May 21st, 2020, 01:35:09 AM IST

దేశంలో లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు ఆగిపోవడంతో ఈ ప్రభావం సినిమా ధియేటర్లపై, మల్టీప్లెక్స్‌లపై పడింది. అయితే పెద్ద పెద్ద మల్టీప్లెక్స్‌లు సైతం మైంటైన్ చేయలేక, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక చతికిలపడ్డాయి. అయితే లాక్‌డౌన్ 4.0 లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్నిటికి సడలింపులు ఇచ్చినా షూటింగ్‌లకు, సినిమా ధియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు మాత్రం అనుమతులు ఇవ్వలేదు.

అయితే ఈ నేపధ్యంలో తమకు అనుమతులిస్తే ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తిని జరగకుండా చూసుకుంటామని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు తాము పాటించబోతున్న విధి, విధానాలను, తీసుకోబోతున్న జాగ్రత్తలకు సంబంధించిన ప్లాన్‌ను సిద్దం చేసి పంపించింది. అయితే మరి దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో తెలియాల్సి ఉంది.