పవన్ కళ్యాణ్ కోసం థమన్ స్పెషల్ ట్యూన్

Friday, December 13th, 2019, 02:20:07 PM IST

పవన్ కళ్యాణ్ చాల రోజుల విరామం తరువాత సినిమాల్లో నటించబోతున్నాడు. ఏ మాత్రం హడావిడి లేకుండానే పింక్ రీమేక్ షురూ చేసారు చిత్ర బృందం. ఇతర సినిమా వేడుకలకు కూడా హాజరయ్యే పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రారంభానికి హాజరు కాలేదు. అయితే ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించనున్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే పాటలు, ఫైట్లు, డాన్స్, రొమాన్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి. కానీ మొదటిసారి అలాంటివేమీ లేని కథని ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

పవన్ కళ్యాణ్ కోసం థమన్ స్పెషల్ ట్యూన్ ని అందించినట్లు తెలుస్తుంది. అయితే పింక్ చిత్రం లో అత్యాచారం జరిగిన నలుగురు అమ్మాయిలకు న్యాయం చేసే లాయర్ పాత్రలో పవన్ నటిస్తున్నారు. అందుచేత పవన్ కి, కథకి అనుకూలంగా పాటని కంపోజ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల అలా వైకుంఠపురంలో పాటలు యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి థమన్ ఆ రేంజ్ లో ఇస్తాడో లేదో చూడాలి. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో అంజలి, నివేద థామస్ లు నటిస్తున్నట్లు సమాచారం.