బాబోయి శ్రీరెడ్డి లీక్స్ … ఈ సారి బుక్ అయిన ఫేమస్ సింగర్ !

Friday, April 6th, 2018, 09:40:16 AM IST


ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ విషయం లో హీరోయిన్ లు గాయత్రి గుప్తా, మాధవి లత లతో పాటు తాను కూడా లైంగిక వేధింపులకు గురి అయ్యానని మీడియా చానెల్స్ తో ఇంటర్వూస్ ఇస్తున్న శ్రీరెడ్డి ఇవాళ ఏకంగా ఇండియన్ ఐడల్ విజేత, గాయకుడు శ్రీరామచంద్ర తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఇండియన్ ఐడిల్ విన్నర్ శ్రీరామచంద్ర తనతో అసభ్యంగా చాట్ చేశాడంటూ ‘వాట్సప్’ స్క్రీన్ షాట్స్ ను సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.

మన ఇండియన్ ఐడల్ గారి వాట్సాప్ చాట్ చూడండి, శ్రీరామ్ సిగ్గుపడాలి, అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన వాట్సప్ స్క్రీన్ షాట్స్ ను తన ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. తనకు దైర్యం వుందని, అందుకే నిజాలను నిర్భయంగా బయటపెడుతున్న అని ఆమె అంటున్నారు. ఆమె ఈ పోస్ట్ పెట్టిన వెంటనే సోషల్ మీడియాలో మొత్తం ప్రస్తుతం ఈ టాపిక్ పెద్ద వైరల్ గా మారింది. అయితే ఈ విషయం పై గాయకుడూ శ్రీరామచంద్ర తన స్పందన తెలియచేయవలసి వుంది…..

  •  
  •  
  •  
  •  

Comments