మోడీ కోసం వీడియోనే వదిలిన పవన్ అన్న..!

Sunday, November 20th, 2016, 07:55:58 PM IST

nagababu
నరేంద్ర మోడీ పెద్ద నోట్లని రద్దు చేయాలనీ నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా సెలబ్రిటీలందరు మోడీ నిర్ణయాన్ని సమర్థించారు. ఇన్నేళ్లకు ఓ ప్రధాని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడంటూ సినీ రాజకీయ ప్రముఖులు మోడీని అభినందించారు.కాగా ప్రముఖ నటుడు మెగా బ్రదర్ అయిన నాగబాబు కూడా మోడీని ప్రశంసలతో ముంచెత్తాడు. మాములుగా కాదండోయ్.. ఓ అరగంట నిడివిగల వీడియో ద్వారా మోడీని పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పై స్పందించిన నాగబాబు మోడీని ప్రశంసలతో ముంచెత్తాడు.

డెబ్భై ఏళ్ల తరువాత దేశంలో దమ్మున్న మగాడు పుట్టాడని నాగబాబు అన్నారు. బురద లోనుంచి పుట్టిన పద్మాలు వికసిస్తాయని, కుళ్లిపోయిన సమాజం నుంచి వికసించిన పద్మమే మోడీ అని నాగబాబు అన్నారు. తాను మోడీ అభిమానికాదని, మంచి పని ఎవ్వరు చేసినా అభినందిచాల్సిన అవసరం ఉందని అన్నారు.తన అన్న చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, ఆయనతోపాటు తాముకూడా కాంగ్రెస్ లోనే ఉన్నామని అన్నారు. అంత మాత్రాన మోడీని విమర్శించాలని లేదని అన్నారు. ఓ అరగంట నిడివిగల వీడియో ద్వారా నాగబాబు తన స్పందనని తెలియజేయడం విశేషం.

వీడియో కోసం క్లిక్ చేయండి