‘శైలజారెడ్డి అల్లుడు’ గా నాగ చైతన్య!

Friday, January 19th, 2018, 02:48:16 PM IST

నవ యువ కథానాయకుడు, అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య తన నూతన చిత్రాన్ని నేడు ప్రారంభించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నాగ వంశీ నిర్మాతగా, యువ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో ఆయన శైలజ రెడ్డి అల్లుడి గా నటిస్తున్నారు. శైలజ రెడ్డి గా ప్రముఖ నటి రమ్యకృష్ణ చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు మారుతీ ఈ చిత్ర ఓపెనింగ్ ఫోటోలను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ‘కొత్త ప్రయాణం మొదలైంది మీ అందరి ఆశీర్వాదాలు కావలి’ అని ఆయన ట్వీట్ చేశారు. మరొక ప్రక్క చైతన్య చందు మొండేటి దర్శకత్వం లో వస్తున్న సవ్యసాచి లో నటిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా చేస్తున్న ఈ చిత్రం లో ప్రముఖ నటుడు మాధవన్, భూమిక ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. సవ్యసాచి చిత్రాన్ని మార్చి లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యుద్ధం శరణం తో కాస్త డీలాపడ్డ చైతన్య ఈ రెండు చిత్రాలతో మళ్ళి ఫారం లోకి వస్తారని సినీ జనం అభిప్రాయపడుతున్నారు…