టాలీవుడ్ ముచ్చ‌ట్లు : టెన్ష‌న్‌లో నాగ‌చైతన్య‌ ..?

Wednesday, March 13th, 2019, 06:56:45 PM IST

టాలీవుడ్ క్యూట్ క‌పుల్స్ అక్కినేని నాగ‌చైత‌న్య‌లు పెళ్ళైన త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి జంట‌గా న‌టిస్తున్న చిత్రం మ‌జిలీ. నిన్నుకోరి ఫేం ద‌ర్శ‌కుడు శివ నార్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌ల అయిన మ‌జిలీ టీజ‌ర్, సాంగ్స్ ఆక‌ట్లు కోవ‌డంతో ఈ చిత్రం పై మంచి అంచానాలే ఉన్నాయి.

అయితే తాజా మ్యాట‌ర్ ఏంటంటే మ‌జిలీ ఏప్రిల్ 5న విడుద‌ల అవుతుండ‌గా.. ఎప్రిల్ 11న సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. దీంతో తాజాగా విడుద‌ల అయిన ఎన్నిక‌ల షెడ్యూల్ మ‌జిలీ చిత్ర యూనిట్‌కి షాక్ ఇచ్చింది. ఈ క్ర‌మంలో డేర్ చేసి సినిమాను విడుద‌ల చేస్తే కలెక్ష‌న్స్ పై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని చిత్ర యూనిట్ ఖాంగారు ప‌డుతోంది.

ఇక ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే నాగ చైత‌న్య‌కు ఈ సినిమా రిజ‌ల్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చైతూ న‌టించిన గ‌త చిత్రాల‌న్నీ బ‌క్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని భావిస్తున్నాడు చైత‌న్య‌. మ‌రి టీజ‌ర్ ప్రామిసింగ్‌గానే ఉన్నా, ఈ చిత్రం పై చైతూ కాన్ఫిడెంట్‌గా ఉన్నా టైమ్ క‌లిసి వ‌స్తుందో లేదో అని టెన్ష‌న్ మొద‌లైంది. మ‌రి నాగ చైత‌న్య‌కు మ‌జిలీ ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తుందో చూడాలి.