కోలీవుడ్ లోకి నాగ చైతన్య ఎంట్రీ ?

Friday, February 17th, 2017, 02:00:39 AM IST


అక్కినేని చిన్నోడు నాగ చైతన్య గత ఏడాది మంచి విజయాలు అందుకుని జోరు పెంచాడు. దానికి తోడు గ్లామర్ భామ సమంతతో ప్రేమాయణం సాగించి లేటెస్ట్ గా నిశ్చితార్థం కూడా కానిచ్చేశాడు. ఇక ఇప్పటికే తెలుగులో హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న చైతు ఇప్పుడు కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా ”నరగఁసూరన్” పేరుతొ రూపొందే హర్రర్ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడట !! కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథ చర్చలు జరుగుతున్నాయని, ఈ సినిమాలో అరవింద్ స్వామి కూడా నటిస్తాడట. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక నిర్మాత గౌతమ్ మీనన్ నిర్మిస్తాడని తెలిసింది. సో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల చేస్తారట !! మరి కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య అక్కడ ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుంటాడో చూడాలి !!