కోలీవుడ్ లోకి అక్కినేని హీరో ఎంట్రీ !

Tuesday, September 20th, 2016, 01:44:54 PM IST

NAgachaitanya
ఈ మధ్య అక్కినేని నాగ చైతన్య బాగా జోరు పెంచాడు. ఇప్పటికే ‘ప్రేమమ్’ చిత్రంలో నటిస్తున్న చైతు ఈ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 7 న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు, ఖచ్చితంగా ‘ప్రేమమ్’ సినిమా తనకు బెంచ్ మార్క్ అవుతుందని భావిస్తున్నాడు. ఇక ఆయన ఇదివరకే నటించిన ”సాహసం శ్వాసగా సాగిపో” విడుదలకు సిద్ధంగా ఉంది, ఈ సినిమా తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ”నిన్నే పెళ్లాడతా” వచ్చే నెలలో సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాలతో పాటు గ్లామర్ భామ సమంతతో మనోడి ప్రేమాయణం ఇంకా జోరుగానే సాగుతున్న విషయం తెలిసిందే. తెలుగులో సినిమాలు చేస్తూనే కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు చైతు. ఇప్పటికే అయన కోలీవుడ్ లో సినిమా చేయడానికి మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడట. ఖచ్చితంగా కోలీవుడ్ లోకి మంచి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడట !! నిజమే .. ఇప్పటికే కోలీవుడ్ హీరోలు ఎంతో మంది టాలీవుడ్ బాక్స్ ఆఫీసును కొల్లగొడుతుంటే .. మన తెలుగు హీరోలు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను టార్గెట్ చేయడం మంచి ఆలోచన !! మరి చైతు తమిళ్ ఎంట్రీ సక్సెస్ కావాలని కోరుకుందాం.