సమంత‌తో గొడ‌వ‌లు స్టార్ట్ అయ్యాయి.. నాగ చైతన్య సంచ‌ల‌నం..!

Friday, November 2nd, 2018, 11:54:49 AM IST

అక్కినేని నాగ చైత‌న్య న‌టించిన సవ్య‌సాచి చిత్రం తాజాగా దీపావ‌ళి కానుక‌గా ఈ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పై పాజిటీవ్ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే కొద్ది రోజులుగా నాగ చైతన్య స‌వ్య‌సాచి ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా వ‌రుస ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స‌వ్య‌సాచి విష‌యాల‌తో పాటు కొన్ని ఆశ‌క్తిక‌ర విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టాడు చైత‌న్య‌.

ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే.. స‌మంత‌తో గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయ‌ని చైత‌న్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు విష‌యం ఏంటంటే స‌మంత- చైత‌న్య‌లు గ‌త ఏడాది పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే పెళ్లికి ముందు ప‌లు చిత్రాల్లో న‌టించి మెప్పించ‌న ఈ జంట తాజాగా పెళ్లి త‌ర్వాత తొలిసారిగా నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ‌ మ‌జిలీ చిత్రంలో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే సెట్స్ పైకి వెళ్ళిన ఈ చిత్రంలో.. సామ్-చైతూలు భార్య భ‌ర్తలుగా న‌టిస్తున్నారు. అయితే క‌థ‌లో భాగంగా స‌మంత – చైత‌న్య‌లు గొడ‌వ‌లు ప‌డ‌తార‌ట‌. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు ఆ స‌న్నివేశాల్నే తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌. దీంతో తాజా ఇంట‌ర్వ్యూలో చైతూ.. మా మ‌ధ్య గొడ‌వ‌లు స్టార్ట్ అయ్యాయ‌ని చెప్ప‌డంతో సోష‌ల్ మీడియాలో ఈ టాపిక్ వైర‌ల్ అవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments