బాలకృష్ణ వ్యాఖ్యలపై మండిపడ్డ నాగబాబు.. ఏమన్నాడంటే..!

Thursday, May 28th, 2020, 11:47:19 PM IST

లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్‌లు, సినిమా రిలీజ్‌లకు అనుమతి తీసుకునేందుకై ఇటీవాల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలంతా సమావేశమయిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సమావేశానికి బాలకృష్ణ తప్ప మిగతా వాళ్ళు అంతా హాజరయ్యారు. ఇదే విషయంపై స్పందించిన బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చల గురించి తనకు తెలియదని, పేపర్లో వచ్చే వార్తల ద్వారా మాత్రమే తెలిసిందని బాలకృష్ణ ఆరోపించారు.

అయితే బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు బాలయ్య వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదని అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలు పరిశ్రమనే కాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించేలా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వానికి, తెలుగు చిత్ర పరిశ్రమకు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఎవరు చేశారో.. ఏపీని ఎవరు సర్వనాశనం చేశారనేది అందరికీ తెలుసని నాగబాబు ఆరోపించారు. బాలకృష్ణ ఇండస్ట్రీకి కింగ్ కాదు హీరో మాత్రమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.