చిరంజీవిపై ఆసక్తికర వాఖ్యలు చేసిన నాగార్జున…

Friday, August 16th, 2019, 01:13:41 AM IST


73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక ప్రైవేట్ మీడియా మీడియా ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సమావేశానికి హాజరైన టాలీవుడ్ నవమన్మథుడు అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. నాకు తెలిసి తెలుగు సినిమా చరిత్రలో మెగా స్టార్ చిరంజీవి చాలా కష్టపడుతారని, తన స్వయంకృషితో తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడని, కానీ అది రాత్రికి రాత్రే వచ్చింది కాదని, అంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించడానికి చిరంజీవి చాలా కష్టపడ్డారని నాగార్జున అన్నారు. తానూ అంతలా కష్టపడి ఒక బంగారు బాట వేశారు కాబట్టే, తనని ఇన్స్పిరేషన్ గా తీసుకోని తన కుటుంబం నుండి అంతమంది హీరోలు వచ్చారని నాగార్జున తెలిపారు.

ఈమేరకు ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాగార్జున గారు మాట్లాడుతూ… “నేను చేసిన విభిన్నమైన పాత్రలకు స్ఫూర్తి నాన్నగారే. ఆయన్ను చూసే అన్ని రకాల క్యారెక్టర్లు ఎలా చేయాలో తెలుసుకున్నా. ఆయన కాకుండా చిరంజీవి గారిని చూసి కూడా ఇన్ స్పైర్ అయ్యాను. చిన్న చిన్న క్యారెక్టర్ల స్థాయి నుంచి హీరోగా అటుపై మెగాస్టార్ గా ఎదిగిన తీరు నిజంగా ఆదర్శనీయమే ” అని తడుముకోకుండా నాగార్జున సమాధానం చెప్పేశారు.