అఖిల్ విషయంలో ఎంటర్ కానంటున్న నాగ్ ?

Tuesday, January 23rd, 2018, 12:32:53 PM IST

అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా అఖిల్ భారీగా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని మూట కట్టుకుంది. దాంతో చాలా గ్యాప్ తరువాత హలో సినిమాతో విజయాన్ని అందుకున్నాడు కానీ అది అఖిల్ కు అంతగా ఉత్సాహాన్ని ఇవ్వలేదు. హలో సినిమా విషయంలో నాగార్జున అన్ని దగ్గరుండి మరి చూసుకున్నాడు. ప్రతి విషయంలో నాగార్జున ఇన్వాల్మెంట్ ఉంది. ఫలితం విషయంలో కూడా నాగార్జున వల్లే అంటూ టాక్స్ రావడంతో అఖిల్ విషయంలో నాగార్జున అలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాడట. ఇకపై అఖిల్ సినిమాల విషయంలో నాగార్జున జోక్యం ఉండదట ? అఖిల్ కు ఏ కథ నచ్చితే అదే చేయని , అఖిల్ విషయంలో జోక్యం చేసుకోనని చెప్పాడట. సో అఖిల్ కు స్వేచ్ఛ లభించినట్టే .. మరి ఈ నేపథ్యంలో అఖిల్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడా అన్నది ఆసక్తి కరంగా మారింది.