నంది అవార్డుల ప్రదానోత్సవ తేదీలు ఖరారు!

Wednesday, January 21st, 2015, 06:41:39 PM IST


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ, టీవీ, రంగస్థల నంది పురస్కారాల ప్రదానోత్సవ తేదీలను తాజాగా ప్రకటించింది. కాగా 2012, 2013 సంవత్సరాలకు గాను రాష్ట్ర విభజన తర్వాత ఈ పురస్కారాలను అందించబోతోంది. ఇక ఉగాది రోజున ప్రభుత్వం నంది సినీ అవార్డులను ప్రధానం చేయనుంది. అలాగే అక్టోబర్ 15న అనంతపూర్ లో నంది టీవీ పురస్కారాలను అందజేయనుంది. ఇక మే 28వ తేది దివంగత ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలో నంది రంగస్థల పురస్కారాలను ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా త్వరలో ఈ పురస్కారాలకు సంబంధించిన కమిటీని ఏర్పాటు చేసి నామినేషన్లను ఆహ్వానించనున్నారు.