మూవీ అప్డేట్ : డైరెక్ట్ గా ఓటిటి లోకి రానున్న నాని మల్టీస్టారర్ సినిమా – ఎప్పుడంటే…?

Monday, May 18th, 2020, 01:03:14 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన సొంత ఇమేజ్ ని సంపాదించుకొని, తన నటనతో ప్రతి తెలుగు ప్రేక్షకుడి మదిలో ఒక సుస్థిరమైన స్థానాన్ని సొంతం చేసుకున్న నటుడు నాచురల్ స్టార్ నాని… ఎన్నో సినిమాలలో తన విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టుకున్న నాని, తొలిసారిగా మరొక హీరో తో కలిసి ఒక ప్రతినాయక పాత్రలో నటించిన చిత్రం “V”… కాగా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని ఓటిటి లో విడుదల చేయడానికి నాని ఒప్పుకున్నారని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొనుగోలు చేశారు.

కాగా ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన నిర్మాత అల్లు అరవింద్, తన సొంత ఆహా ఆప్ ప్లేట్ ఫామ్ లో నాని నటించిన చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. అందుకు “V” చిత్ర నిర్మాతల్ని మరియు కథానాయకుల్ని అల్లు అరవింద్ ఒప్పించారని సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబందించిన ఓటిటి విడుదల తేదీని అల్లు అరవింద్ ప్రకటించనున్నారని సమాచారం. కానీ దానికి కుదిరినటువంటి ధర, టీవీ ల్లో వరల్డ్ ప్రీమియర్ షో ఎప్పుడు వేయబోతున్నారు, ఏ ఛానల్ లో ఎప్పుడు వేయబోతున్నారని వివరాలు బయటకు రాలేదు…