నాని న్యూ మూవీ టైటిల్ బలే ఉందే!

Thursday, October 19th, 2017, 10:42:45 AM IST

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం మంచి హిట్స్ తో దూసుకుపోతున్నాడు. వరుస హ్యాట్రిక్ విజయాలతో సినిమా సినిమాకి తన మార్కెట్ ను కూడా చాల వరకు పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ లో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ షూటింగ్ సగం పూర్తయ్యింది. డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ను పూర్తి చేసి అదే నెల క్రిస్మస్ కానుకగా సినిమాను రిలీజ్ చెయ్యాలని నాని ఆలోచిస్తున్నాడు.

అంతే కాకుండా మరో సినిమాను కూడా నాని చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో కృష్ణార్జున యుద్ధం సినిమాను చేస్తున్నాడు. అందులో నాని ద్విపాత్రాభినయం చేయనున్నాడు. అయితే రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే నాని మరో సినిమాను ఒకే చేశాడు. నేను శైలజ సినిమాతో మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ తీరుమల డైరెక్షన్ లో ఒక సినిమాను చేయబోతున్నాడు ఆ సినిమాకు చిత్రలహరి అనే టైటిల్ ని నిర్ణయించినట్లు తెలుస్తోంది. టైటిల్ డిఫరెంట్ గా ఉండడంతో దర్శకుడు కొత్త ప్రయోగమే చేబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments