`బిగ్‌బాస్‌-2`కి కాల్షీట్లు కేటాయించాశాడే!?

Monday, April 23rd, 2018, 10:31:19 PM IST


అస‌లు `బిగ్‌బాస్‌- 2` హోస్ట్ ఎవ‌రు? ఈ ప్ర‌శ్న‌కు ఇన్నాళ్లు క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్‌కి వీలు చిక్క‌క‌పోవ‌డంతో నానిని సంప్ర‌దించార‌ని మాత్రం స‌మాచారం ఉంది. అయితే నాని ఓకే చెప్పాడా లేదా? అన్న‌ది ఇప్ప‌టికీ సస్పెన్స్‌. తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. ఇక షూటింగ్ ప్రారంభించ‌డానికి ఇంకెంతో టైమ్ లేదు. జూన్‌లోనే చిత్రీక‌ర‌ణ ప్రారంభించాల్సి ఉంది. అంటే ఇప్ప‌టికే హోస్ట్‌ని ఫైన‌ల్ చేసి, పార్టిసిపెంట్స్ వివ‌రాల్ని వెల్ల‌డించాల్సి ఉంటుంది.

స‌రిగ్గా ఇలానే ఆలోచించిన స్టార్ మా ఇప్ప‌టికే నానీని హోస్ట్‌గా ఫైన‌ల్ చేసేసింద‌ని చెబుతున్నారు. నాని ఈ రియాలిటీ షో కోసం 30రోజుల కాల్షీట్లు ఇచ్చేశాడ‌ట‌. అందుకు పారితోషికంగా రూ.3.5కోట్లు అందుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. బిగ్‌బాస్ సీజ‌న్ 1కి ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తూ 8 కోట్ల పారితోషికం అందుకున్నాడు. ఇప్పుడు నానీ కూడా పెద్ద ప్యాకేజీనే అందుకున్నాడంటూ చ‌ర్చ సాగుతోంది. జూన్‌లో సీజ‌న్ స్టార్ట‌వుతోంది కాబ‌ట్టి ఇక నానీ రంగంలోకి దిగాల్సిందేన‌న్న మాటా వినిపిస్తోంది. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే తాజా అప్‌డేట్ అంద‌నుంద‌ని స‌మాచారం.

  •  
  •  
  •  
  •  

Comments