ఆ హీరోయిన్ వద్దంటున్న నాని ?

Friday, October 12th, 2018, 09:48:35 PM IST

ప్రస్తుతం వరుస విజయాలతో జోరుమీదున్నాడు హీరో నాని. తాజాగా నాగార్జునతో కలిసి దేవదాస్ అంటూ మంచి విజయాన్ని అందుకున్న నాని ప్రస్తుతం జర్సీ సినిమా కోసం విదేశాల్లో ఉన్నాడు. దాంతో పాటు భిన్నమైన చిత్రాల దర్శకుడూ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని ఎంపిక చేద్దామని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.

అయితే ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా వద్దని నాని చెప్పాడట. ఎందుకంటే కాజల్ నాని పక్కన ఏ రకంగా చుసిన పెద్దదానిలా కనిపిస్తుంది కాబట్టి నో అని చెప్పాడేమో అని అనుకుంటున్నారు జనాలు. ప్రస్తుతం కాజల్ రవితేజ తో కలిసి తేరి రీమేక్ లో నటిస్తుంది. అలాగే కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఓ సినిమాలో చేస్తుంది. మరి హీరోయిన్ గా కాజల్ ని వద్దన్నాడు కాబట్టి నెక్స్ట్ ఎవరి పేరు వినిపిస్తుందో చూడాలి.