“సాహో”తోనే “గ్యాంగ్ లీడర్”.!

Sunday, August 25th, 2019, 10:37:52 PM IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై పెరిగిన హైప్ కు చాలా సినిమాలే వెనక్కి వెళ్లిపోయాయి కానీ ఈ చిత్రం విడుదల మళ్ళీ ఆగేసరికి ఆ సినిమాలు అన్ని వెలుగులోకి వచ్చాయి.అలాగే ఈ సినిమా విడుదల సమయంలోనే రేసులో ఉన్న మరో సినిమా నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “గ్యాంగ్ లీడర్” కూడా ఒకటి.

విలక్షణ దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా సాహో వల్ల విడుదల వాయిదా పడింది.అయితే ఇప్పుడు ఇదే సాహో తో ఈ సినిమా ట్రయిలర్ ను ఈ నెల 28న విడుదల చెయ్యబోతున్నట్టుగా చిత్ర యూనిట్ తెలుపుతూనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న “సాహో” సినిమాతో కూడా అటాచ్ చేస్తున్నట్టు తెలియజేసారు.సంగీత సంచలనం అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధంగా ఉంది.