మొత్తానికి నయనతార సైరా కోసమే దిగొచ్చిందా…?

Thursday, September 19th, 2019, 01:11:45 AM IST

లేడి సూపర్ స్టార్ నయనతార కోసం ప్రతేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన నటన, తన వ్యక్తిత్వం, తన మర్యాద ఎలాంటిదో అందరికి తెలుసు. కాగా ఇక అసలు విషయానికొస్తే, నయనతార ఎపుడు సినిమాలు చేసిన కూడా, ఆ సినిమాకు సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రం అసలే కనబడదు. ఏదైనా సినిమాకు సంతకం పెట్టడానికి ముందే తాను పెటువంటి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననని, అలా దర్శక నిర్మాతలు ఒప్పుకుంటేనే నయనతార ఆ సినిమా చేయడానికి ఒప్పుకుంటుందనేది నిజం. అందుకు నయనతార నటించినటువంటి ప్రతి సినిమానే సాక్షం. తన సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా తనెక్కడ కూడా కనిపించదు. చివరికి అదెంత పెద్ద సినిమా అయినా, ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్న కూడా.

కాగా నయనతార తాజాగా మెగాస్టార్ చిరంజీవితో నటించిన చిత్రం సైరా. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించారు. కాగా ఈ సినిమా విషయంలో నిర్మాత రామ్ చరణ్, నయనతారని ఎలా ఒప్పించాడో తెలియదు కానీ సైరా సినిమాకి సంబందించిన ప్రమోషన్లలో నయనతార పాల్గొననుందని సమాచారం. సైరా సినిమాకు సంబందించిన ప్రీ రెలీజ్ కార్యక్రమంతో పాటే సెప్టెంబర్ 19 న జరగబోయే పాటల వేడుకకు కూడా నయనతార రానుందని సమాచారం. ఇకపోతే సైరా తో పాటే తమిళంలో విజయ్ సరసన నటిస్తున్న చిత్రానికి కూడా నయనతార ప్రమోషన్ చేయనుందని సమాచారం.