మరో సినిమాకు కమిట్ అయిన నయనతార ?

Tuesday, April 17th, 2018, 09:51:22 PM IST


సౌత్ క్రేజీ గర్ల్ నయనతార తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పింది. ఇప్పటికే ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా సినిమాలో నటిస్తున్న ఈ భామ అటు తమిళంలో హీరో అజిత్ సరసన నటించేందుకు ఓకే చెప్పింది. దాంతో పాటు మలయాళంలో ఓ డార్క్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాకు కూడా ఓకే చెప్పడం విశేషం. సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా ఇమేజ్ తెచ్చుకున్న నయనతార లేడి ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ఓ మంచి క్రేజ్ తెచ్చుకుంది. మలయాళంలో కొట్టాయం కూర్చనా అనే టైటిల్ తో రూపొందే సినిమాలో నటిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments