సినీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం.. ఇట్స్ న‌య‌నతార‌ అఫిషియ‌ల్..!

Thursday, November 8th, 2018, 04:59:17 PM IST

త‌మిళ్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తారకు సంబందించిన ఒక వార్త తాజాగా సినీ వ‌ర్గాల్ల‌తో హాట్ టాపిక్ అవుతోంది. దీపావ‌ళి సంద‌ర్భంగా న‌య‌న‌తార త‌న లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్‌తో దిగిన సెల్ఫీని సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో కోలీవుడ్ జానాల్లో చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. ఇక అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేష్‌తో కొంత కాలంగా న‌య‌న‌తార స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ ఇద్ద‌రు పెళ్లి చేసుకోకుండానే.. కాపురం పెట్టేశార‌ని కోలీవుడ్‌లో గుస‌గుస‌లాడుకుంటున్నారు.

న‌య‌న‌తార ఇప్పుటికే ఇద్ద‌రితో ప్రేమ‌వ్య‌వ‌హారం న‌డిపి పెళ్లి దాకా వ‌చ్చి బ్రేక్ అయిన సంగ‌తి తెలిసిందే. మొద‌ట త‌మిళ్ న‌టుడు సింబుతో ఘాటు రోమాన్స్ న‌డిపిన న‌య‌న్, ఆ త‌ర్వాత బ్రేక‌ప్ చెప్పేసింది. ఇక ఆ త‌ర్వాత ప్ర‌భుదేవ‌తో ప్రేమాయ‌ణం న‌డిపి.. ఆల్‌మోస్ట్ పెళ్లి దాకా వ‌చ్చి బ్రేక్ అయ్యింది. అయితే ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు విఘ్నేష్‌తో న్యూ రొమాంటిక్ జ‌ర్నీ స్టార్ట్ చేసిన న‌య‌న్ పెళ్లి చేసుకుండానే కాపురం చేస్తుంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా త‌న మొగుడు కాని మొగుడుతో దీపావ‌ళి పండ‌గ జ‌రుపుకుని, త‌న ల‌వ‌ర్‌ని గ‌ట్టిగా హ‌గ్ చేసుకుని ఒక ఫొటో దిగి సోష‌ల్ మీడియాలో పెట్టింది. దీంతో న‌య‌న తార‌ పెళ్లి చేసుకోకుండానే కాపురం పెట్టేసింద‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.