న‌య‌న‌తార మైండ్ బ్లోయింగ్ పోస్ట‌ర్

Wednesday, October 10th, 2018, 01:43:41 PM IST

న‌య‌న‌తార‌.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌తోనూ వంద కోట్లు కొల్ల‌గొట్టే స‌త్తా ఉంద‌ని నిరూపిస్తోంది. అందుకే న‌య‌న్ ప్ర‌స్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఇటీవ‌లే న‌య‌న్ న‌టించిన `కోకో కోకిల‌` (కోల‌మావు కోకిల‌) చిత్రం త‌మిళ్‌, తెలుగు ఆడియెన్‌ని మెప్పించింది. `కోల‌మావు కోకిల` ఆస్కార్ (ప్రాంతీయ‌) నామినేష‌న్ల కేట‌గిరీలోనూ పోటీప‌డింది. ఈ సినిమా త‌ర్వాత న‌య‌న్ న‌టిస్తున్న తాజా చిత్రంపైనా ప్ర‌పంచం ఉత్కంఠ‌గా వేచి చూస్తోంది. త‌లైవి న‌టిస్తున్న 63 చిత్రం ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉంది. తాజాగా టైటిల్‌ని ప్ర‌క‌టించారు. `ఐరా` టైటిల్‌ని ఫిక్స్ చేశారు. తెలుగు, త‌మిళ్‌లో ఈ చిత్రాన్ని క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేయ‌నున్నారు. యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఈ చిత్రానికి ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కోట‌పాడి జె.రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఫ‌స్ట్‌లుక్‌ని లాంచ్ చేశారు. న‌య‌న్ ద్విపాత్ర‌ల్ని ఎలివేట్ చేస్తున్న ఈ ఫ‌స్ట్‌లుక్‌ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది.

మొద‌టిసారి కెరీర్‌లో న‌య‌న్ ఈ చిత్రంలో ద్విపాత్రాభిన‌యం చేయ‌డం ఓ సెన్సేష‌న్ అనే చెప్పాలి. కెరీర్ ఆద్యంతం ప్ర‌యోగాలు చేస్తూ స‌త్తా చాటుతున్న న‌య‌న్ మ‌రోసారి ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర‌తీస్తుందో చూడాలి. తాజాగా రివీల్ చేసిన పోస్ట‌ర్‌లో న‌య‌న్ ద్విముఖాలు చూసి ట్విన్స్ అనే అనుకోవాలా? తెలుపు, న‌లుపు వేరియేష‌న్ క‌థేంటో? గోముఖ వ్యాఘ్రం లాంటి పాత్ర‌లో క‌నిపించ‌బోతోందా? చూస్తుంటే ఈసారి జాతీయ అవార్డుపై క‌న్నేసిందా? అన్న క్యూరియాసిటీ పెరిగింది. చూద్దాం.. త‌లైవి ఏం చేస్తుందో! మ‌రోవైపు న‌య‌న‌తార `సైరా- న‌ర‌సింహారెడ్డి` లాంటి మోస్ట్ అవైటెడ్ చిత్రంలోనూ న‌టిస్తోంది. స‌మ్మ‌ర్ రేస్‌లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.