మాస్ మ‌హారాజాపై దుష్ప్ర‌చారం?

Thursday, October 25th, 2018, 07:00:20 PM IST

మాస్ మహారాజా రవితేజపై దుష్ప్ర‌చారం సాగుతోందా? అత‌డు న‌టిస్తున్న తాజా సినిమా రిలీజ్ కాక‌పోవ‌డానికి కార‌ణాలేంటి? ఆల‌స్యం వెన‌క అస‌లు రీజ‌న్ ఏంటి? అంటే .. న‌వంబ‌ర్‌లో ప‌లు క్రేజీ సినిమాల రిలీజ్‌లు క్యూలో ఉన్నాయి కాబ‌ట్టి అందుకు భ‌య‌ప‌డే నిర్మాత‌లు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌లేదంటూ ఓ ప్ర‌చారం సాగుతోంది. వాస్త‌వానికి ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం రిలీజ్ కావాల్సిన `అర‌వింద స‌మేత‌’, `పందెంకోడి2` వంటి భారీ చిత్రాల రాక‌తో రిలీజ్ ఆగిపోయింద‌ని ప్ర‌ముఖ తెలుగు డెయిలీ పేర్కొంది.

అయితే ర‌వితేజ‌- శ్రీనువైట్ల కాంబినేషన్ మూవీ `అమర్ అక్బర్ ఆంటోనీ` ఎట్టిప‌రిస్థితిలో హిట్టు కొట్టి తీరాల్సిన స‌న్నివేశం నెల‌కొంది. ఇది శ్రీ‌నువైట్ల‌తో పాటు ర‌వితేజ‌కు ఎంతో ఇంపార్టెంట్. అందుకే రిలీజ్ విష‌యంలో ఆచితూచి అడుగులేస్తున్నార‌ట‌. మంచి రిలీజ్ త‌మ‌కు క‌లిసొస్తుంద‌నే ఈ వెయిటింగ్ అని చెబుతున్నారు. టీజర్ ని అక్టోబర్ 29 న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శ‌రవేగంగా జరుగుతున్నాయి. గ్లామర్ డాల్ ఇలియానా కథానాయికగా నటిస్తుండగా, రవితేజ తో ఆమె నాలుగో సారి కలిసి నటిస్తుండండం విశేషం..పూర్తిభాగం అమెరికా లో షూటింగ్ జరుపుకోగా దర్శకుడు శ్రీనువైట్ల పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్‌ అఫ్ అమర్ అక్బర్ ఆంటోనీ కి మంచి రెస్పాన్స్ వచ్చింది..ఈ చిత్రం పూర్తిగా స‌రికొత్త క‌థ‌, భిన్న‌మైన‌ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుండగా రవితేజ మూడు గెట‌ప్పుల్లో డిఫరెంట్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. మైత్రి సంస్థ ఎట్టిప‌రిస్థితిలో హిట్ కొట్టాల‌న్న ప్ర‌ణాళిక‌తో ఉందిట‌.

  •  
  •  
  •  
  •  

Comments