బాలయ్య కొత్త లుక్ పై సెటైర్లు కూడా గట్టిగానే..

Tuesday, August 20th, 2019, 08:14:10 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.గత కొన్నేళ్ల నుంచి చూస్తున్నట్టయితే బాలకృష్ణ తన పంథా మార్చేసి యువ హీరోలకు సైతం గట్టి పోటీ ఇచ్చేలా మేకోవర్ మరియు సరికొత్త డ్రెస్సింగ్ స్టైల్స్ తో పాటుగా క్రేజీ డాన్స్ స్టెప్పులతో అదరగొట్టేస్తున్నారు.దానికి ఉదాహరణగా ఆయన హీరోగా నటించిన “జైసింహా” సినిమాను చెప్పొచ్చు.తమిళ్ విలక్షణ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలయ్య లుక్ మరియు డాన్సులు చూసి అభిమానులు వెర్రెత్తిపోయారు.

అయితే ఇప్పుడు మళ్ళీ ఇదే దర్శకునితో మరో చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించారు.దీనికి సంబంధించిన ఫోటోయే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.వాన్ డైక్ గడ్డం లుక్ లో బాలకృష్ణ దర్శనం ఇచ్చేసరికి అచ్చు గుద్దినట్టు హాలీవుడ్ హీరో రాబర్ట్ డౌనీ జూనియర్ గుర్తుకొచ్చారు.ఐరన్ మ్యాన్ చిత్రంలో డౌనీ ఎలా ఉన్నారో అలాగే ఉన్నారని కొంతమంది అంటుండగా ముందు బయటకొచ్చిన లుక్ ను చూసి మాత్రం సినిమా ఏదో తేడా కొట్టేలా ఉందని భావిస్తున్నారు.

ఈ ఫొటోలో బాలయ్యను చూసినట్లయితే అది క్లియర్ గా మేకప్ అని తెలిసిపోతుంది అంతే కాకుండా ఇదివరకే బాలకృష్ణ ఒక్కమగాడు అనే సినిమాతో మేకప్ వేసి సాహసం చేసారు.దీనితో మళ్ళీ ఆ సినిమాకు వచ్చిన ఫలితమే దీనికి వస్తుందా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.అలాగే దరువు సినిమాలోని మాస్ మహారాజ రవితేజ ఒక లుక్ లో చైనీస్ వ్యక్తిగా కనిపిస్తారు,అలాగే దశావతారంలో చైనీస్ కమల్ హాసన్ పాత్రల్లా ఈ ఇది కూడా ఉందని నెటిజన్స్ బాలయ్య లేటెస్ట్ లుక్ పై గట్టిగానే సెటైర్లు విసురుతున్నారు.