కాపీ కొట్టిన “బిచ్చగాడు 2” పోస్టర్ కే ఇంత హంగామానా?

Friday, July 24th, 2020, 05:21:46 PM IST

మన దగ్గర దాదాపు సీక్వెల్ సినిమాలు అనేవి చాలా అరుదుగానే వస్తుంటాయి. ఎక్కువగా అయితే భారీ హిట్ అయిన సినిమాలకే మన దగ్గర సీక్వెల్ సినిమాలు వస్తుంటాయి. అయితే మన తెలుగులో సీక్వెల్ సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కానీ ఎక్కువ సక్సెస్ రేట్ అయితే కోలీవుడ్ కు ఉంది. ఇప్పటికే సూర్య నటించిన సింగం సిరీస్ అయితే మూడు సినిమాలు వరుస హిట్ అయ్యాయి.

అయితే ఇప్పుడు సూర్య నటించిన “గ్యాంగ్” తమిళ్ లో “తానా సెర్నందా కూట్టం” రెండు భాషల్లో హిట్టయ్యింది. అలాగే అదే కోలీవుడ్ కు చెందిన మరో హీరో విజయ్ ఆంటోనీ నటించిన “పిచ్చకారన్” తెలుగులో “బిచ్చగాడు”గా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది అని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ ఆంటోనీ కూడా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుంది అని సోషల్ మీడియాలో హంగామా చేసాడు.

ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చెయ్యగా నెటిజన్స్ దానిని చూసి నవ్వుతున్నారు. ఈ సినిమాలో బిలినియర్ అయిన విజయ్ ఆంటోనీ వెనక్కి తిరిగి ఉండగా అతని ముందు చాలా మంది జనం ఉన్నట్టు ఈ పోస్టర్ ఉంది. చూడ్డానికి బాగానే ఉన్నా నెటిజన్స్ సూర్య నటించిన “గ్యాంగ్” సినిమా పోస్టర్ తో పోలుస్తూ గాలి తీసేసారు. ఈ రెండు పోస్టర్ లు ఒకేలా ఉండటం అంశం పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న మనుషులను కూడా విజయ్ టీం కాపీ కొట్టేయడం గమనార్హం. దీనితో ఈ రెండు పోస్టర్లు చూపించి నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు.