సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న సమంత డిగ్రీ సర్టిఫికెట్!

Monday, June 1st, 2020, 12:20:28 PM IST

అక్కినేని కోడలు సమంత రుతుప్రబు సినిమాల్లో మాత్రమే కాక, చదువుల్లో కూడా ఎంతో చలాకీగా, చురుగ్గా ఉంటారు. ఇటీవల తన చదువుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ను అభిమానులతో పంచుకున్నారు సమంత. అయితే తాజాగా ఒక అభిమాని సమంత డిగ్రీ సర్టిఫికెట్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.అయితే ఆ అభిమాని పోస్ట్ చేస్తూ, సమంత ను ట్యాగ్ కూడా చేశారు. అయితే సమంత ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆ సర్టిఫికెట్ ఎలా సంపా దించావు అని అడగగా, అతను ట్వీట్ ను డిలీట్ చేయడం జరిగింది.

అయితే ఆ డిగ్రీ సర్టిఫికెట్ లో సమంత 2007 లో డిగ్రీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. చెన్నై లోని సెల్టా మెరిస్ లో సమంత డిగ్రీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.తాను డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పూర్తి చేసినట్లు ఉంది. అయితే సమంత చదువు అనంతరం మోడలింగ్ లో కి అడుగు పెట్టారు.సమంత ఏ మాయ చేసావే చిత్రం తో తెలుగు వెండి తెర కి పరిచయం అయ్యారు.అనంతరం వరుస విజయాలతో చాలా తక్కువ కాలం లోనే సమంత స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.సమంత తాజాగా జాను చిత్రం తో ప్రేక్షకులను అలరించారు. అంతేకాక ఫ్యామిలీ మాన్ వెబ్ సెరిస్ కి సీక్వెల్ గా తీస్తున్న దాంట్లో టెర్రరిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సీరీస్ విడుదల కి సిద్దంగా ఉంది.