మూడవ ప్రయత్నం ‘రొమాంటిక్’ వర్కౌట్ అయ్యేనా?

Monday, February 10th, 2020, 03:52:05 PM IST

పూరి జగన్నాద్ తన కొడుకు పూరి ఆకాష్ కి హిట్ ఇవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆంధ్రాపోరి, మెహబూబా చిత్రాలు బాక్సఫీస్ వద్ద దారుణ ఫలితాలు మూటగట్టుకుంది. అయితే ఈ సారి పూరి జగన్నాధ్ ఇంకాస్త బోల్డ్ గా తన కొడుకు ని చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. అనిల్ పాడూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ చిత్రం ఫై ప్రేక్షకుల నుండి పోజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రం ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఆకాష్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.

అయితే కొడుకుకి హిట్ ఇవ్వాలని పూరి తన మార్క్ పబ్లిసిటీ తో అభిమానులని ఆకర్షిస్తున్నారు పూరి జగన్నాధ్. తాజాగా విడుదల అయినటువంటి పోస్టర్ ఫై నెటిజెన్ల నుండి పోజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. లిప్ లాక్ తో విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రం మే 29 న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.