“ఫలక్ నామ దాస్” పై మండిపడుతున్న నెటిజన్స్.!

Sunday, June 2nd, 2019, 09:15:00 PM IST

టాలీవుడ్ లోని బోల్డ్ కాన్సెప్ట్ చిత్రాలు ఊపందుకునే సరికి చాలా సినిమాలు వెండి తెర పైకి వచ్చేసాయి.కానీ కొన్ని సినిమాల్లో మాత్రం ఈ బోల్డ్ నెస్ లోని డోస్ కాస్త ఎక్కువ అవుతుందనే చెప్పాలి.”అర్జున్ రెడ్డి” అనే సినిమాతో విజయ్ దేవరకొండ సందర్భానుసారంగా అక్కడక్కడా బూతులు వాడుతారు.అలాగే కొన్ని ఫంక్షన్స్ లో కూడా తన ఆటిట్యూడ్ ద్వారా నోరు జారిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే ఇప్పుడు విజయ్ కు కంపిటిషన్ గా మరో హీరో వెండి తెరపైకి దూసుకు వచ్చాడు.అతడే విశ్వక్ క్షేన్,హీరోగా మరియు దర్శకునిగా తీసిన “ఫలక్ నామా దాస్” చిత్రం ఇటీవలే విడుదలై మాస్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనని అందుకుంది.

అదే సందర్భంలో విశ్వక్ క్షేన్ తీరు వలన సోషల్ మీడియా ప్రజానీకం విమర్శలు కూడా చేస్తుంది.తాజాగా విశ్వక్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ముందు తన సినిమాకు సంబంధించి సక్సెస్ మీట్ కోసం మాట్లాడుతూ చివర్లో తన సినిమాపై విష ప్రచారం చేస్తున్న వారిని తన సినిమాలోని చెప్పిన డైలాగుల స్టైల్ లోనే బూతు పురాణం కురిపించారు.దీనితో కొంతమంది ఇతన్ని విజయ్ వారసుడు అని విజయ్ ను మించిన వాడు అని ఇంత అతి పనికి రాదనీ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.సినిమా నచ్చలేదు అని చెప్పిన వారిపై మాట్లాడ్డం ఇలాగేనా అంటూ మరికొంత మంది విమర్శలు చేస్తున్నారు.మరి దీనిపై విశ్వక్ ఏమన్నా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.