ఆచార్య నుండి సరికొత్త పోస్టర్ కి భారీ రెస్పాన్స్

Wednesday, April 14th, 2021, 08:47:27 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఉగాది పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసింది. షడ్రుచుల సమ్మేళనం మా సిద్ధ నీలాంబరి ల ప్రేమ అంటూ దర్శకుడు కొరటాల శివ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం లో సిద్ధ కి జోడీగా పూజా హెగ్డే నీలాంబరి పాత్రలో నటిస్తున్నారు. అయితే వీరిద్దరికీ సంబందించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ పూజ హెగ్డే ను పట్టుకొని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య నటిస్తున్న ఈ సినిమా లో చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇటీవల విడుదల అయిన ఈ చిత్రం లోని పాట సైతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.