మహేష్ స్ట్రాటజీ కంప్లీట్ డిఫరెంట్…భారీ ప్లాన్ వేశారుగా!

Sunday, December 15th, 2019, 04:41:14 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొత్త సినిమా కి డిఫరెంట్ గా పబ్లిసిటీ ని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు అతి భారీగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలకు బిన్నంగా ప్రేక్షకుల కు అందుబాటులో ఎల్బీ స్టేడియం లో ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించనున్నారు సరిలేరు నీకెవ్వరూ చిత్ర బృందం. సినిమా కి కౌంట్ డౌన్ మొదలవ్వడంతో ఊహించని రీతిలో అభిమానులు సోషల్ మీడియా లో రచ్చ చేస్తున్నారు. చిత్రం బృందం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకని జనవరి 5 వ తేదీన నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే మాస్ మహేష్ బాబు ఫెస్టివల్ తో ఈ చిత్రం ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తుంది.

మహేష్ కి జోడిగా మొదటిసారి రష్మిక ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్టైనర్ గా మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సఫలం అవుతుందని తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.