ప్రభాస్ కోసం మరో ఆసక్తికర టైటిల్ ?

Thursday, October 11th, 2018, 03:21:19 PM IST

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రం సాహొ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తో పాటు ప్రభాస్ జిల్ ఫేమ్ రాధా కృష్ణ తో కూడా ఓ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. పూర్తిస్థాయి ప్రేమకథగా తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఇటలీలో మొదలైంది. మొదటి షెడ్యూల్ ని ప్రభాస్ తో పాటు హీరోయిన్ పూజ హెగ్డే పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. కొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ అక్కడే జరగనుంది. తదుపరి షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేసారు. ఈ సినిమా టైటిల్ పై అయన ఫాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆమూర్ అనే టైటిల్ పెడుతున్నట్టు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆమూర్ అంటే ఫ్రెంచ్ లో ప్రేమ అని అర్థం. ఇది పక్కా ప్రేమకథ కాబట్టి అలాంటి టైటిల్ పెడతారని అంటున్నారు .. అయితే తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది .. అదేమిటంటే .. సినిమాకు జాన్ అనే టైటిల్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. ఇందులో హీరో పేరు జాన్ కాబట్టి అదే టైటిల్ అయితే బాగుంటుందని .. పైగా జాన్ అనే పేరు అందరికి తెలుసు కాబట్టి ఆ టైటిల్ కె మొగ్గు చూపిస్తున్నారు.