సవ్యసాచి హీరోయిన్ సెన్షేష‌న్.. నాగ‌చైత‌న్య మ్యానేజ్ చేశాడు..!

Saturday, October 27th, 2018, 02:11:10 PM IST

అక్కినేని నాగ చైత‌న్య – డైరెక్ట‌ర్ చందూమొండేటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం స‌వ్య‌సాచి. గ‌తంలో ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ప్రేమ‌మ్ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది. దీంతో స‌వ్య‌సాచి చిత్రం పై ప్రేక్ష‌కుల్లో ఆశ‌క్తినెల‌కొంది. దానికి త‌గ్గ‌ట్టుగానే డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన స‌వ్య‌సాయి చిత్ర టీజ‌ర్, ట్రైల‌ర్‌ల‌తో ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను భారీగా పెంచేసింది. ఇక ఈ చిత్రంలో చైతూ స‌ర‌స‌న న్యూఎంట్రీ భామ‌ నిధి అగ‌ర్వాల్ న‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే తాజాగా నిధి అగ‌ర్వాల్ చిత్ర ప‌మోష‌న్‌లో భాగంగా నాగ చైత‌న్య పై చేసిన వ్యాఖ్య‌లు సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. స‌వ్య‌సాచి చిత్రంలో నాగ చైత‌న్య క్యారెక్ట‌ర్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని.. చైతూ ఎడ‌మ చేయి త‌న ఆధీనంలో ఉండ‌ద‌ని.. అలా న‌టించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని.. అయితే చైతూ ఇంట‌లిజెంట్‌గా మ్యానేజ్ చేశాడ‌ని నిధి చెప్పింది. ఇక త‌న పాత్ర గురించి చెబుతూ.. త‌న‌ది ఈ చిత్రంలో మ‌లుపు తిప్పే పాత్ర అని.. త‌న పాత్ర‌ను ద‌ర్శ‌కుడు చాలా బాగా డిజైన్ చేశాడ‌ని.. ఇక త‌మిళ న‌టుడు మాధ‌వ‌న్ గారి పాత్ర కూడా హైలెట్ అవుతోంద‌ని నిథి చెప్పంది. ఇక దీపావ‌ళి కానుక‌గా నవంబ‌ర్ 2న రానున్న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కులు విజ‌య‌వంతం చేయాల‌ని ఈ ముద్దుగుమ్మ కోరింది.