ఐటమ్ సాంగ్ కి భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్న ఇస్మార్ట్ భామ!

Monday, March 23rd, 2020, 06:04:47 PM IST

గతేడాది ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్లాక్ బస్టర్ తో మంచి రేసులోకి వచ్చింది నిధి అగర్వాల్. నిధి అగర్వాల్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే చాలా పేరు సంపాదించుకుంది. అయితే తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా లో ఒక బంపర్ ఆఫర్ దక్కించుకుంది. మాస్ హీరోగా ఎదిగేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మొదటి సినిమా నుండి బెల్లంకొండ శ్రీనివాస్ కమర్షియల్ అంశాలతో సినిమా నీ తీస్తున్నారు. అయితే బెల్లంకొండ సినిమాలో ఐటెం సాంగ్ నీ మాత్రం తప్పనిసరి చేస్తూ సినిమాలు చేస్తున్నారు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా లో ఐటెం సాంగ్ లో చేసేందుకు నిధి అగర్వాల్ కి అవకాశం వచ్చింది. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం భారీగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.దాదాపు 60 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.