సైరా సినిమాతో నిహారిక కల నెరవేరిందిగా..!

Wednesday, September 18th, 2019, 11:58:36 PM IST

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, న‌య‌న‌తార హీరోయిన్‌గా కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మాతగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. అయితే తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాను అక్టోబర్‌ 2న విడుదల చేయబోతున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్ది ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అయితే నేడు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. అయితే సైరా ట్రైలర్ చూశాక ఒక్కొక్కరికి గూస్‌బంప్స్ వచ్చాయని అంటుంటే, ట్రైలర్ చూశాక సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయని కొందరు అంటున్నారు. అయితే ఈ ట్రైలర్‌లో మెగాబ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక కనిపించడం మరో విశేషం. చిన్ననాటి నుంచి తన పెద్దనాన్నను చూస్తూ పెరిగిన నిహారిక ఆయనతో కలిసి ఆయన హీరోగా చేస్తున్న సినిమాలో నటించే అవకాశం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసింది. అయితే సైరా సినిమా ద్వారా నిహారిక కల నెరవేరింది. సైరా సినిమాలో ఒక మన్యం పిల్లగా నిహారిక రెండు సార్లు కనిపించనుందని తెలుస్తుండగా, తాజాగా విడుదలైన సైరా ట్రైలర్ లో నిహారిక పోరాట సన్నివేశంలో కనిపిస్తుంది. అంటే ఆమె పాత్ర కూడా ఇందులో పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్టు కనిపిస్తుంది. ఏదేమైనా సైరా ద్వారా నిహారిక కల నెరవేరడంతో ఆమె చాలా హ్యాపీగా ఉందట.