నీహారిక పెళ్లి చేసుకోబోయేది ఇతడినే… క్లారిటీ వచ్చేసింది!

Friday, June 19th, 2020, 08:22:51 AM IST

మెగా ఫ్యామిలీ లో నీహారిక తనదైన మార్క్ ప్రతిభ తో బుల్లితెర పై, వెండి తెర పై అలరిస్తూ ఉంది. అయితే తాజాగా నీహారిక సోషల్ మీడియా ద్వారా ఒక ఫోటో ను అభిమానులతో షేర్ చేశారు. అయితే అందులో మిస్ నుండి మిస్సెస్ గా మారుతున్న విషయాన్ని వెల్లడించారు. ఆ కొద్దిసేపటికే ఒక ఫోటో ను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే నీహారిక పెళ్లి పై ఇప్పటివరకు గతం లో చాలా వార్తలు వచ్చాయి. వాటన్నిటికీ ఇక ఫుల్ స్టాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ విషయం పై నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ఇట్టే విషయాన్ని పసిగట్టారు. నీహారిక కి కాబోయే వ్యక్తి పేరు, ఊరు వివరాలను సైతం నెటిజన్లు తెలుసుకున్నారు. అయితే ఇక మెగా బ్రదర్ నాగబాబు అఫిషియల్ గా అనౌన్స్ చేయడమే లేటు అని తెలుస్తోంది. నాగబాబు కి మిత్రుడు అయిన ఐజి జొన్నలగడ్డ ప్రభాకర్ రావ్ తనయుడు అయిన జొన్నలగడ్డ వెంకట చైతన్య ను నీహారిక పెళ్లి చేసుకోనుంది. అయితే ఇదే విషయం పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.గతం లో కూడా వీరు మెగా ఫ్యామిలీ లో జరిగిన పలు ఫంక్షన్ లకు హజరు అయినట్లు తెలుస్తుంది. మరి ఈ విషయం పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.