సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న మెగా ముద్దుగుమ్మ..!

Tuesday, July 9th, 2019, 11:42:24 PM IST

హీరో నాగబాబు కూతురు నిహారిక ఒక మ‌న‌సు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో కాస్త నిరాశకు లోనయ్యింది ఈ ముద్దు గుమ్మ. అంతేకాదు ఈ సినిమాలో నీహారిక నటనపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే అప్పటి నుంచి కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఒక వెబ్ సిరీస్ చేసింది. అయితే ఆ వెబ్ సిరీస్ కు కాస్త మంచి గుర్తింపు రావడంతో హ్య‌పీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది నిహారిక‌.

అయితే ఈ చిత్రం కూడా కూడా అమెకు నిరాశనే మిగిల్చింది. ఇక ఇటీవల సూర్య‌కాంతం చిత్రంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రం కూడా అనుకున్న అంచనాలను అందుకోలేక చతికిలపడిపోయింది. అయితే వరుస అపజయాలతో విసుగు తెచ్చుకున్న నిహారిక ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక సినిమాలలో తన న‌ట‌నకి గుడ్‌బై చెప్పి నిర్మాతగా స్థిరపడిపోవాలని భావిస్తుంద‌ట‌. ఇప్పటికే త‌న సొంత బేన‌ర్ పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నిహారిక ప‌లు వెబ్ సిరీస్‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే అదే బ్యానర్‌పై సినిమాలు కూడా చేయాల‌ని నిహారిక ప్లాన్ చేసుకుందని స‌మాచారం. అయితే అలా చెస్తే మాత్రం తన తొలి సినిమా మెగా హీరోతోనే చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మాత్రం నిహారిక ఇంకా ఎలాంటి అధికారిక డిసీషన్‌ను మాత్రం ప్రకటించలేదు.