చిరు, పవన్ ల గురించి నిఖిల్ ఏమన్నారో తెలుసా?

Sunday, June 21st, 2020, 07:09:16 PM IST

యంగ్ హీరో నిఖిల్ తన సినిమా ల గురించి పలు విషయాల గురించి వివరించారు. లాక్ డౌన్ వేళ పెళ్లి చేసుకున్న నిఖిల్ చివరగా అర్జున్ సురవరం చిత్రం తో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది కార్తికేయ 2 చిత్రం షూటింగ్ ప్రారంభించిన నిఖిల్ లాక్ డౌన్ కారణంగా తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే తన సినీ జీవితం గురించి, తన అభిమాన నటుల గురించి నిఖిల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పెళ్లి తర్వాత తన జీవితం లో ఎలాంటి మార్పులు జరగలేదు అని అన్నారు.గుంటూరు బిర్యాని అంటే చాలా ఇష్టం అని అన్నారు.

అయితే టాలీవుడ్ హీరోల గురించి ప్రస్తావిస్తూ ప్రభాస్ భాయ్ బంగారం అని వ్యాఖ్యానించారు. మెగాస్టార్ చిరంజీవి తన కి ఎల్లపుడూ స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. గాంగ్ లీడర్ సినిమా చూసి డైలాగ్స్ చెప్పేవాడిని అని అన్నారు.కేటీఆర్ మోడర్న మేధావి అని, అల్లు అర్జున్ అద్భుత నటుడు అని, ఎన్టీఆర్ తెలివి నైపుణ్యం ఉన్న నటుడు అని అన్నారు.

అయితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ అతను ఒక ఫైటర్ అని,ఆయనకు ఎప్పటికీ నేను అభిమానినే అని వ్యాఖ్యానించారు. రామ్ చరణ్ గొప్ప వ్యక్తి అని, ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తారు అని వ్యాఖ్యానించారు. అర్జున్ సురవరం ఆడియో ఫంక్షన్ రోజు చిరు తన గురించి మాట్లాడటం తన జీవితం లోనే గొప్ప రోజు అని అన్నారు.