సినీ ఇండస్ట్రీ లో ఎదుగుతుంటే వారిని అణచి వేయడానికి చూస్తుంటారు – నిఖిల్

Monday, June 22nd, 2020, 09:22:48 AM IST

లాక్ డౌన్ సమయం లో పెళ్లి చేసుకున్న హీరో నిఖిల్ తాజాగా మీడియా తో ముచ్చటించారు. పలు విషయాల గురించి ప్రస్తావించిన నిఖిల్ సుశాంత్ మరణం పై కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.బాలీవుడ్ లో నేపోటిజమ్ అంటూ అగ్ర హీరో ల పై, నిర్మాత ల పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై హీరో నిఖిల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత కచ్చితంగా నేపొటిజం ఉంటుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే కేవలం సినిమా ఫీల్డ్ లో మాత్రమే కాదు అని, ప్రతి రంగం లో కూడా నేపోతిజమ్ ఉంటుంది అని అన్నారు.అయితే ఈ విషయం పై నిఖిల్ సిద్ధార్థ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళు సినీ ఇండస్ట్రీ లో ఎదుగుతుంటే వారిని అనిచి వేయడానికి చూస్తుంటారు అని వ్యాఖ్యానించారు. అయితే అలాంటి సమయం లో చాలా స్ట్రాంగ్ కావాలి కానీ, ఆత్మహత్య పరిష్కారం కాదు అని వ్యాఖ్యానించారు. జీవితం లో ఎన్ని సమస్యలు వచ్చినా పోరాడి నిలబడాలి అని, అదే జీవితం అని అన్నారు.