మానవత్వం చాటుకున్న నితిన్.. 10 లక్షల విరాళం..!

Tuesday, March 24th, 2020, 12:00:23 AM IST

తెలుగు రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా హీరో నితిన్ స్పందిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించి మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధంలో త‌న వంతు భాగ‌స్వామ్యం అందించాల‌ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 10 లక్షల రూపాయలను అందించారు.

అయితే మొత్తం రెండు రాష్ట్రాలకు కలిపి 20లక్షలు విరాళం అందించిన నితిన్ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రజలు సహకరించాలని కోరారు. మార్చ్ 31 వరకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పాటిస్తూ ప్రజలంతా ఇళ్ళలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.