టాప్ లో ట్రెండ్ అవుతున్న నితిన్ పెళ్లి గిఫ్ట్..!

Tuesday, July 28th, 2020, 10:57:28 AM IST

మొత్తానికి మన టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లలో ఒకరైన నితిన్ ఒక ఇంటివాడయ్యాడు. అయితే మొన్ననే పెళ్లి చేసుకున్న నితిన్ చేస్తున్న లేటెస్ట్ సినిమా “రంగ్ దే” దర్శకుడు వెంకీ అట్లూరి ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. అదే రోజునే నితిన్ తో డబ్బింగ్ చెప్పించుకొని మరీ తన టీం తరపున గిఫ్ట్ రెడి చేసారు.

అయితే వీరు ప్లాన్ చేసిన ఈ గిఫ్ట్ ఇప్పుడు యూట్యూబ్ లో ఆదరగొడుతుంది. ఒక్క రోజులో 3.2 మిలియన్ వ్యూస్ మరియు ఒక లక్ష 52 వేలకు పైగా లైక్స్ తో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ వస్తుంది. మొత్తానికి మాత్రం నితిన్ పెళ్లికి రిలేటెడ్ గా ప్లాన్ చేసిన ఈ టీజర్ మాత్రం సూపర్ రెస్పాన్స్ ను అందుకుంది అని చెప్పాలి.