బీష్మ కు రంగం సిద్ధం .. డిసెంబర్ నుండే మొదలు ?

Wednesday, October 10th, 2018, 11:00:46 AM IST

ఈ మధ్య మళ్ళీ వరుస పరాజయాలు హీరో నితిన్ ని టెన్షన్ పెడుతున్నాయి. లై, చిన్నదానా నీకోసం, చల్ మోహనరంగా, తాజా శ్రీనివాస కళ్యాణం లు బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇక ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ దిల్ రాజు బ్యానర్ లో చేసిన శ్రీనివాస కళ్యాణం మరి దారుణమైన ఫలితాన్ని అందుకోవడంతో కాస్త గ్యాప్ తీసుకుని చలో వంటి సూపర్ హిట్ అందించిన వెంకీ కుడుములు దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. భీష్మ పేరుతొ తెరకెక్కే ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావొచ్చాయి. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారట. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందట!!